రోజురోజుకీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా గాని మనలో చాలామందికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ యుగంలో ఏ సమాచారాన్ని అయినా సరే స్మార్ట్ ఫోన్, ఈ – బుక్ లలో చదువుతున్న గాని పుస్తకాన్ని మీరు చేతిలో తీసుకొని చదవడంలో ఉన్న ఫీలింగ్ వేరు. ఇక అసలు విషయం చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకం ఎలా ఉంటుంది..? దాన్ని ఎవరు రచించారు..? ఇలాంటి విశేషాలను ఓసారి చూద్దాం..
Also Read: Prasanna Vadanam :సస్పెన్స్ థ్రిల్లర్ గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్..
అత్యంత సుదీర్ఘమైన పుస్తకం గురించి తెలుసుకోవాలంటే.. అసలు దానిని ఎలా సుదీర్ఘమైన పుస్తకంగా పరిగణిస్తారో తెలుసుకోవాలి. పదాల సంఖ్య, పేజీల సంఖ్య లెక్క ఆధారంగా ఓ పుస్తకానికి ఈ రికార్డు దక్కుతుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకంగా ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ ఉంది. ఈ నవలను మొదటగా ఫ్రెంచ్ భాషలో రచయిత ‘మార్సెల్ ప్రౌస్ట్’ రచించారు. ఈ పుస్తకం 1913 నుంచి 1930 మధ్యలో 7 వాల్యూమ్స్ లో పబ్లిష్ అయింది. ఇక ఫ్రెంచ్ భాషలో ఈ పుస్తకం పేరు ‘అ లా రీచెర్చే డు టెంప్స్ పెర్డు’.
Also Read: Akhilesh Yadav: అఖిలేష్ ఆస్తులెన్నో తెలుసా! భార్యకు ఎంత అప్పు ఇచ్చారంటే..!
కాగా 1922లో రచయిత మార్సెల్ ప్రౌస్ట్ చనిపోగా.. ఆయన మరణించాక తర్వాత కొన్ని వాల్యూమ్స్ ను ప్రచురితం చేసారు. ఫ్రెంచ్ భాషలో ఉన్న దానిని ఆంగ్లం లోకి అనువదించాక.. ఈ పుస్తకంలోని పేజీలు ఎక్కువగా ఉండడంతో పబ్లిష్ చేసేందుకు చాలా ప్రచురణ సంస్థలు మొదట రచయిత మార్సెల్ ప్రౌస్ట్ కు సహాయం చేయలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు 1913లో ఓ ప్రచురణ సంస్థ మార్సెల్ ప్రౌస్ట్ పుస్తకంలోని మొదటి వాల్యూమ్ ను ‘స్వాన్స్ వే’ అనే టైటిల్ తో పబ్లిష్ చేసింది.