NTV Telugu Site icon

World leaders offer condolences: ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ప్రపంచ నేతల సంతాపం

Pm Modi

Pm Modi

World leaders offer condolences: శుక్రవారం తెల్లవారుజామున అహ్మదాబాద్ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ఆమె మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రధాని మోడీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ కూడా ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. తమ తల్లి హీరాబెన్ మోదీ మరణ వార్త విని చాలా బాధపడ్డానంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రధాని మోడీ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతికలగాలను ప్రార్థిస్తామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మృతి పట్ల పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. “తల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టమేమీ లేదు. ప్రధాని మోదీ తల్లిని కోల్పోయినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీకి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను” -షహబాజ్ షరీఫ్, పాకిస్థాన్‌ ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మృతి పట్ల శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే సంతాపం తెలిపారు. ” హీరాబెన్ మోదీ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రియమైన తల్లిని కోల్పోయినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీకి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్నాయి.” – మహింద రాజపక్సే, శ్రీలంక మాజీ ప్రధాని

“నరేంద్రమోదీ జీ, ఆయన కుటుంబసభ్యులకు ఆయన మాతృమూర్తి హీరాబెన్‌ మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” -షేర్‌ బహదూర్‌ దేవుబా, నేపాల్‌ మాజీ ప్రధాని

“అతిపెద్ద నష్టానికి గురైన ప్రధాన మంత్రి శ నరేంద్ర మోదీ జీకి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి మీ కోసం నా హృదయం పగిలిపోతుంది” -డెనిస్ అలిపోవ్, భారత్‌లోని రష్యా రాయబారి

“గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రగాఢ, హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము.” -ఫిలిప్ అకెర్‌మాన్, భారతదేశంలోని జర్మన్ రాయబారి

Heeraben Modi: హీరాబెన్‌ మోడీ అంత్యక్రియలు పూర్తి.. మాతృమూర్తి పాడె మోసిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు హీరాబెన్ మోదీ కన్నుమూశారు. బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు నిర్వహించారు. హీరాబెన్ మోదీ అంత్యక్రియలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్ రూపానీ, గుజరాత్ కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఈ ఉదయం గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా తన తల్లికి రేసన్ నివాసంలో నివాళులర్పించారు, అనంతరం ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు. తల్లి మృతితో ప్రధాని మోదీ భావోధ్వేగపూరిత ట్వీట్‌ చేశారు.. ‘నిండు నూరేండ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది. ఆమెలో తాను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఆమె ఒక నిస్వార్ధ కర్మయోగి. విలువలకు నిలువెత్తు నిదర్శనం’ అని చెప్పారు.