చైనాలోని వూహాన్‌లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ మరో కొత్త రూపం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XE వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్ BA2 సబ్ వేరియంట్ కంటే XE వేరియంట్ 10 రెట్లు వేగంగా విస్తరిస్తోందని తెలిపింది.
తొలిసారిగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ XE వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ప్రస్తుతం అక్కడ 600 కంటే ఎక్కువ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు ప్రస్తుతం అమెరికాలో ఒమిక్రాన్ XE వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో ఈ వేరియంట్ తీవ్రత, వ్యాప్తి, ఇతర లక్షణాలను కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు బయటపడిన వైరస్‌లు పరివర్తన చెంది మరికొన్నిరకాలుగా మారే అవకాశముందని సైంటిస్టులు సూచిస్తున్నారు. కాగా చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ జడలు విప్పింది. దీంతో చైనాలోని పలు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ కూడా విధిస్తున్నారు.
https://ntvtelugu.com/1260-new-corona-cases-in-india/
