NTV Telugu Site icon

World Cup 2023: ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్

Eng Vs Nz

Eng Vs Nz

వన్డే ప్రపంచక్ కప్2023కి అదిరిపోయే ఆరంభం న్యూజిలాండ్ జట్టుకు లభించింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌ ), రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్‌) అజేయమైన శతకాలతో రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ టీమ్ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో కివీస్ టీమ్ ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది.

Read Also: Lucifer 2: లూసిఫర్ సీక్వెల్ తో వస్తున్నాడు.. మరి గాడ్ ఫాదర్..?

ఈ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే, రచిన్‌ రవీంద్ర జోడి రెండో వికెట్‌కు 273 పరుగుల అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. త‌ద్వారా 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి కివీస్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఇక, 283 ప‌రుగుల టార్గెట్ ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ కు సెకండ్ ఓవ‌ర్‌లోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్ విల్ యంగ్‌ను సామ్ కర్రాన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు పంపించాడు. దీంతో 10 ప‌రుగులకే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఆ త‌రువాత వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్ కు వ‌చ్చిన 22 ఏళ్ల ర‌చిన్ ర‌వీంద్ర ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

Read Also: AP CM JAGAN: ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ

ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే సైతం 36 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. వీరిద్దరి హాఫ్ సెంచరీల తర్వాత బ్యాటింగ్ లో మరింత వేగం పెంచి.. పోటాపోటీగా బౌండ‌రీలు కొట్టారు. టీ20 త‌ర‌హాలోనే బ్యాటింగ్ చేయడంతో.. కాన్వే 83 బంతుల్లో, ర‌చిన్ ర‌వీంద్ర 82 బంతుల్లో శతకాలు బాదేశారు. సెంచ‌రీ త‌రువాత కాన్వే మ‌రింత వేగంగా ఆడాడంతో 119 బంతుల్లోనే 150 ప‌రుగుల మార్క్ ను అందుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి భాగస్యామ్యం 273 పరుగులు నెలకొల్పడంతో ఈ మ్యాచ్ 36.2 ఓవర్లలోనే ముగిసింది.