NTV Telugu Site icon

PAK vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. హసన్‌ అలీ ఔట్! గెలిస్తేనే నిలిచేది

Pakistan Vs South Africa

Pakistan Vs South Africa

Pakistan vs South Africa Playing 11: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా మరికొద్దిసేపట్లో పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలీ స్థానంలో వసీం జూనియర్ జట్టులోకి వచ్చాడు. మొహ్మద్ నవాజ్ తిరిగి వచ్చాడు. ఉసామా మీర్ స్థానంలో అతడు ఆడనున్నాడు.

మరోవైపు దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ తెంబా బావుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. అలానే తబ్రిజ్ షమ్సీ మరియు లుంగి ఎన్‌గిడి జట్టులోకి వచ్చారు. రీజా హెండ్రిక్స్, కాగిసో రబడా మరియు లిజాద్ విలియమ్స్ జట్టులో చోటు కోల్పోయారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్‌ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పాక్ ఇంటికి వెళ్లిపోవాల్సిందే. మరోవైపు ఈ పోరులో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌ 1లోకి రావాలని సఫారీలు చూస్తున్నారు.

Also Read: Telangana Elections 2023: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: హరీశ్ రావు

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి.
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్.

Show comments