NTV Telugu Site icon

CM Jagan : కాసేపట్లో గడప గడపకు ప్రభుత్వంపై వర్క్ షాప్

Jagan

Jagan

కాసేపట్లో గడప గడపకు ప్రభుత్వంపై వర్క్ షాప్ ప్రారంభం కానుంది. అయితే.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పని తీరుపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయి. మూడు, నాలుగు అంచెల విధానంలో గడప గడపకు ఎమ్మెల్యేలు వెళుతున్న తీరుపై నివేదికలు అందాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

 

వచ్చే ఎన్నికలే లక్ష్యా వైసీపీ అధినేత సీఎం జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడంతో పాటు.. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా.. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణం తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే, మంత్రులతో గడప గడపకు ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. ఈ కార్యక్రమంపై నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్క్‌ షాప్‌ నిర్వహించనున్నారు.