Site icon NTV Telugu

World Most beautiful Cop: మోడల్‌గా మారడానికి పోలీసు ఉద్యోగాన్ని వదిలిపెట్టను..

World Most Beautiful Cop

World Most Beautiful Cop

World Most beautiful Cop: ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా పోలీసుగా పేరుగాంచిన డియానా రామిరేజ్‌ ఇవాళ వార్తల్లో నిలిచింది. సోషల్‌ మీడియాలో ప్రజలు ఆమెను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళా పోలీసు అని పిలుస్తారు. జాతీయ పోలీసు దళంలో పనిచేయడం గౌరవంగా భావించే మహిళకు దాదాపు 4 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు.

కొలంబియా పోలీసు అధికారి డయానా రామిరేజ్‌ మెడెలిన్ వీధుల్లో పెట్రోలింగ్ చేస్తుంటారు, ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పరిగణించబడుతుంది. అయితే మోడల్ లేదా ఆన్‌లైన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడానికి ఆమె తన పోలీసు ఉద్యోగాన్ని వదులుకోనని చెప్పింది. “నాకు మళ్లీ కెరీర్‌ని ఎంచుకునే అవకాశం వస్తే, నేను వెనుకాడను, నేను మళ్ళీ పోలీసు అధికారిని అవుతాను, మోడల్‌ కావడానికి పోలీసు ఉద్యోగాన్ని వదులుకోను” అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇన్‌స్టా ఫెస్ట్ అవార్డ్స్‌లో ఆమె “బెస్ట్ పోలీస్ లేదా మిలిటరీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్”కి నామినేట్ చేయబడింది. ఈ నామినేషన్‌తో పోలీసు బలగాలకు ప్రాతినిధ్యం వహించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని డయానా రామిరేజ్ అన్నారు.

America: భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం.. 23 ఏళ్లకే అమెరికా చట్టసభలోకి..

డయానా రామిరేజ్‌ ఫోటోలను చూసిన పలువురు కామెంట్ల వర్షం కురిపించారు. “గ్రహం మీద అత్యంత అందమైన పోలీసు అధికారి” అని ఒకరు ప్రకటించారు.”వావ్ అసాధారణంగా అందంగా ఉన్నారు, నేను ఆమెను ప్రేమిస్తున్నాను!” ఆని మరొకరు కామెంట్‌ చేశారు. ఇంకా చాలా మంది ఆమె అందంపై పొగడ్తల వర్షం కురిపించారు.

 

 

Exit mobile version