మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ జబల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై కమల్‌నాథ్ స్పందించారు.
చింద్వారా పార్లమెంఠ్ నియోజకవరం నుంచే పోటీ చేస్తున్నట్లు తేల్చిచెప్పారు. నకుల్ జబల్ పూర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదని.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చింద్వారాను తాము వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు.
చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం కమల్‌నాథ్‌కు కంచుకోట. 1980 నుంచి తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అతని కుమారుడు నకుల్‌నాథ్ ఒకసారి గెలిచారు. 1980, 1984, 1989, 1991, 1998, 1999, 2004, 2009, 2014లో కమల్‌నాథ్ గెలుపొందారు.
1997లో ఒకసారి కమల్‌నాథ్ ఓడిపోయారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్ లాల్ పాట్వా చేతిలో ఓడిపోయారు. 2019లో కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ బరిలోకి దిగారు. 37,536 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా తాను చింద్వారా నుంచి బరిలోకి దిగుతానని నకుల్‌నాథ్ ప్రకటించారు.