NTV Telugu Site icon

Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్ బౌలర్స్ వీరే.!

Womens T20 World Cup 2024

Womens T20 World Cup 2024

Womens T20 World cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత మహిళల జట్టు పూర్తిగా సిద్ధమైంది. ఈసారి టి20 ప్రపంచ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది. టోర్నీలో ఏ ఆటగాళ్లు పాల్గొంటారనేది ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

పూనమ్ యాదవ్:
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళా స్పిన్ బౌలర్ పూనమ్ యాదవ్. 2014లో ఈ టోర్నీలో ఆమె తొలి మ్యాచ్‌ ఆడింది. 18 మ్యాచ్‌లు ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో ఆమె 13.82 సగటుతో, 5.6 ఎకానమీ రేటుతో 28 వికెట్లు తీసింది. ఆమె ఒక్కసారి 4 వికెట్లు తీయడంలో విజయం సాధించింది. అత్యుత్తమ ప్రదర్శన 4/19.

రాధా యాదవ్:
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రాధా యాదవ్ రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఈమె ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో ఆమె 16.94 సగటుతో, 6.4 ఎకానమీ రేటుతో 17 వికెట్లు తీసింది. రాధా అత్యుత్తమ ప్రదర్శన 4/23. ఆమె 2018 సంవత్సరంలో టి20 ప్రపంచ కప్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు.

దీప్తి శర్మ:
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీప్తి శర్మ మూడో స్థానంలో ఉంది. ఆమె 15 మ్యాచ్‌లు ఆడి 15 ఇన్నింగ్స్‌లలో 25.60 సగటుతో, 6.85 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీసుకుంది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 3/15. ఈమె 2018 సంవత్సరంలో తన మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడింది. 2024లో ఎంపికైన భారత జట్టులో ఆమె కూడా ఓ సభ్యురాలు.

ప్రియాంక రాయ్, శిఖా పాండే:
ఈ జాబితాలో శిఖా పాండే, ప్రియాంక రాయ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రియాంక 2009లో తన తొలి మ్యాచ్ ఆడింది. ఆమె 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో 10.91 సగటుతో, 5.73 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీసింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 5/16. ఇక శిఖా పాండే గురించి చూస్తే..15 మ్యాచ్‌లు ఆడితే అందులో 12 ఇన్నింగ్స్‌ల్లో 19.66 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 3/14.