Site icon NTV Telugu

World Cup 2025: మ్యాచ్ ఓడినా.. భారత్ కు సెమీఫైనల్‌కు ఛాన్స్.. ఎలాగంటే?

World Cup 2025

World Cup 2025

World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు వరుసగా మూడు ఓటములు ఎదురయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 19) ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒకానొక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన టీమ్‌ఇండియా.. కొన్ని తప్పుల కారణంగా గెలుపును చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాలతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్ గెలిచే ఆశలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా భారత్‌ సెమీఫైనల్‌కు చేరుకుంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

TDP: ఆ విషయంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి..! ఇప్పటికైనా మారాలని దిశా నిర్దేశం..

టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయినప్పటికీ.. సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఇంకా ఉంది. అయితే, ఇప్పుడు పరిస్థితి ‘డూ ఆర్‌ డై’ అన్నట్లుగా మారింది. ప్రస్తుతానికి భారత్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌కు కూడా నాలుగు పాయింట్లే ఉన్నా, భారత్ కంటే నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది. అయితే సెమీఫైనల్‌కు చేరడానికి భారత జట్టుకు అత్యంత సులభమైన మార్గం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే, టీమ్‌ఇండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

Attack: పాములకు కోపం తెప్పిస్తే.. ఎట్టాగుంటదో తెలుసా.. ఇట్టాగే ఉంటది…

మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారత్ ఒకటి ఓడిపోతే పరిస్థితి కొంచెం సంక్లిష్టంగా మారనుంది. అప్పుడు భారత్ క్వాలిఫికేషన్ న్యూజిలాండ్‌ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా.. భారత్ గెలిచిన ఒక మ్యాచ్‌ను కూడా పెద్ద తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ సెమీఫైనల్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు ఇంకా అవకాశం ఉంది.

Exit mobile version