Nagapur Metro Train: మెట్రో రైలు ఈమధ్య ఎంటర్టైన్మెంట్ కు అడ్డాగా మారుతోంది. యువతీ యువకుల రొమాన్స్ నుంచి మహిళల కొట్లాట వరకు,జిమ్నాస్టిక్స్ నుంచి డ్యాన్సుల వరకు ప్రతీది మెట్రోలో కనిపిస్తుంది. వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు మెట్రోలో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో వీటన్నిటికీ కేంద్రంగా మారింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో రైలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం కొంతమంది అమ్మాయిలు చేసిన పని.
Also Read: G20: జీ20 శిఖరాగ్ర సమావేశం.. ముస్తాబవుతున్న ఢిల్లీ మెట్రో
శని, ఆదివారాలు సెలవులు కావడంతో మెట్రో చాలా రద్దీగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది అమ్మాయిలు అందంగా డ్రెస్సులు ధరించి మెట్రోలో క్యాట్ వాక్ చేశారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు ఒకసారిగా అవాక్కయ్యారు. వారిని చూసి మైమరిచి పోయారు. కళ్లు తిప్పుకోకుండా వారినే చూస్తుండిపోయారు. దీంతో వారిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు అద్భుతంగా డ్రెస్సులు ధరించి ప్రయాణికుల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. ఎక్కడో పెద్ద పెద్ద హోటల్స్ లో జరిగే ఇలాంటి సమావేశాలు వారి ముందే జరగడంతో ప్రయాణీకులు ముందు నమ్మలేకపోయారు. తరువాత ఎంతో ఆనందంతో వారిని చూశారు. ఇక ‘ సెలబ్రేషన్స్ ఆన్ వీల్స్’ పేరు తో నాగపూర్ మెట్రో ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా శుభకార్యాలు, ఫంక్షన్ల కోసం స్కూలు, కాలేజీలు లో జరిగే సెలబ్రేషన్స్ కోసం మెట్రోలో కొన్ని భోగీలను బుక్ చేసుకోవచ్చు. దీనికోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యువతలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ పథకానికి సంబంధించి వివరాలు ఎక్కువమందికి తెలుసు ఆకాశం ఉంది. దీంతో ఎక్కువ మంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిని యోగేంద్ర ఇండియా టీవీ(Yogendraindiatv) అనే ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
नागपुर में चलती मेट्रो में फैशन शो,मेट्रो के डब्बे बने कैटवॉक के लिए रैंप,बच्चे से लेकर बड़ो को कैटवॉक करता देख, यात्री हो गए दंग,. नागपुर मेट्रो ” सेलिब्रेशन ऑन व्हील” नाम से एक योजना चलाती है pic.twitter.com/Bd9thFUTJU
— Yogendraindiatv (@indiatvyogendra) August 28, 2023
