Site icon NTV Telugu

Viral Video: నిజం చెబుతున్న నమ్మండి… ఈ వీడియో చూస్తే మీరు బిత్తర పోవడం గ్యారంటీ

Viral

Viral

Viral Video: ప్రతి ఒక్కరూ పాములను చూసే ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నాలుక రెండు భాగాలుగా విభజించబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అవి వాటి నోటి నుంచి నాలుకను బయటకు తీసినప్పుడల్లా రెండుగా విభజించబడిన నాలుక కనిపిస్తుంది. కానీ ఒక మనిషికి రెండు నాలుకలు ఉండడం మీరెప్పుడైనా చూశారా.. ప్రస్తుతం అలాంటి ఓ మహిళ వార్తల్లో నిలుస్తోంది. ఆ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడం ద్వారా ప్రజలను బిత్తరపోయేటట్లు చేసింది. ఆమె తన టిక్‌టాక్ ఖాతాలో ఆహారానికి సంబంధించిన క్లిప్‌ను అప్‌లోడ్ చేసింది. దానిని చూసిన వినియోగదారులు తమ కళ్లను నమ్మలేకపోతున్నారు.

Read Also:Double Ismart Heroine: హాట్ బ్యూటీ సెట్… పూరి టేస్ట్ అంటే మినిమమ్ ఉంటది

ఆ మహిళ నూడుల్స్ తింటున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు, ఇది సాధారణ విషయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నూడుల్స్ తింటారు, కానీ ఒక మహిళ తినే విధానం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఆ మహిళ నాలుకను రెండు భాగాలుగా కోసి మరీ విలక్షణంగా నూడుల్స్ ను నోటిలో పెట్టుకుని తినడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఒక మహిళ నాలుకను ఇలా రెండు భాగాలుగా చేసి, ఆమె తినే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

Read Also:Hyderabad: నగరం కేంద్రపాలిత ప్రాంతం కానుందా..? సోషల్ మీడియాలో జోరుగా చర్చ

మహిళ తన వింత శరీర మార్పు కథను ప్రఖ్యాత వెబ్ సైట్ తో పంచుకుంది. బాడీ మోడిఫికేషన్ లో భాగంగా తన నాలుకను రెండు భాగాలుగా కత్తిరించుకుంది. మొత్తం ప్రక్రియ తాను ఊహించిన దానికంటే చాలా సులభమైందని, దీనికి కేవలం 15 నిమిషాలు పట్టిందని ఆమె చెప్పింది. ఆపరేషన్ తర్వాత ఆమె నోటి నుండి చాలా లాలాజలం ప్రవహించడం ప్రారంభించిందని, ఆమె నాలుక కూడా వాపు వచ్చిందని మహిళ తెలిపింది. 24 గంటల తర్వాత ఆమె నొప్పి నుండి చాలా ఉపశమనం పొందానని తెలిపింది. ప్రస్తుతం తనకు తినడానికి, త్రాగడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె ఏదైనా సులభంగా తింటుంది. త్రాగుతుంది.

Exit mobile version