NTV Telugu Site icon

Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్

Colour Change

Colour Change

Colour Change Dress: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది రోజుకో కొత్త ఆవిష్కరణలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. అలాంటి ఆవిష్కరణలు చూసి ఒక్కొసారి అవాక్కయిపోక తప్పదు. ఇక దుస్తుల విషయాని కొస్తే ట్రెండింగ్ పేరుతో రోజుకో ఫ్యాషన్ మార్కెట్లో ప్రత్యక్షమవుతోంది. డిజైన్ల విషయం అటుంచింతే.. వాటిని తయారు చేసే వస్త్రాలు డిఫరెంట్ గా వస్తున్నాయి. ఇటీవల వాటర్ ప్రూఫ్ షర్ట్స్ మార్కెట్లోకి వచ్చి మంచి ఆదరణ పొందాయి. ఈ కోవలోనే తాజాగా ఓ మహిళ ధరించిన వెరైటీ డ్రెస్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read Also: Rahul Gandhi complaint to Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‎కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు

వినూత్న డ్రెస్‌లతో మగువలు ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తుండగా తాజాగా ఓ మహిళ ధరించిన వెరైటీ డ్రెస్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌ ఇజి వైట్‌ బాడీకాన్‌ డ్రెస్‌ ధరించిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. సస్టెయినబుల్‌ క్లోతింగ్‌ బ్రాండ్‌ పీహెచ్‌5 నుంచి ఈ డ్రెస్‌ను తయారుచేసినట్టు క్యాప్షన్‌ వెల్లడించింది.

ఈ బ్రాండ్‌ యూవీ-రియాక్టివ్‌ డ్రెస్‌ల తయారీలో గుర్తింపు పొందింది. ఈ వైట్‌ డ్రెస్‌ సూర్యరశ్మి తగలగానే పింక్‌లోకి మారుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. వీడియోలో మహిళ తెల్లటి దుస్తులు ధరించి, ఈ దుస్తులు కూడా రంగు మారుతుందని ప్రజలకు చెబుతోంది. గదిలో ఆమె దుస్తులు తెలుపు రంగులో ఉంటాయి, కానీ ఆమె ఎండలో బయటకు వెళ్లినప్పుడు, ఆమె దుస్తుల రంగు మారి గులాబీ రంగులోకి మారుతుంది. ఆమెను చూడగానే కొన్ని క్షణాల క్రితం తెల్లగా ఉన్నట్టు అనిపించక మానదు. ఆమె మళ్ళీ నీడలోకి వచ్చేసరికి, డ్రెస్ తెల్లగా మారుతుంది.

Read Also: Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్‎ కోసం నాలుగేళ్లుగా పోరాడిన మహిళ.. చివరికి..

ప్రజలు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడ్డారు, దీనికి 2 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. 22 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన డ్రెస్ అని ఒకరు అన్నారు. అదే సమయంలో, దాని ఫాబ్రిక్ ఎక్కువ కాలం మంచిగా ఉండదని ఒకరు కామెంట్ చేశారు.

Show comments