Site icon NTV Telugu

Viral Video: రోడ్డుపై ఎగ్ ఆమ్లట్ వేసిన మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు

Viral Video

Viral Video

దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడి వాతావరణం చల్లబడితే, మరికొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. ఓ మహిళ ఎండలు ఎంతలా ఉన్నాయి అనే దానికి ఏం చేసిందో చూస్తే అవాక్కైతారు.

Read Also: T. Harish Rao: హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఓ మహిళ ముందుగా రోడ్డు మీద కూర్చుని నీళ్లను చల్లి శుభ్రంగా తూడుస్తుంది. ఆ తర్వాత.. పాన్లో ఆమ్లెట్ వేసుకునేలా గుండ్రంగా శుభ్రపరిచి, నూనే పోస్తుంది. అనంతరం.. నవ్వుతూ ఆమె వెంట తెచ్చుకున్న రెండు కోడిగుడ్లను చూపిస్తుంది. వాటిని పగలగొట్టి రోడ్డుపై ఆమ్లెట్ వేస్తుంది. అంతేకాకుండా ఓ గరిటెతో గుండ్రంగా తిప్పుతుంది. అయితే వీడియోలో పూర్తిగా ఏమవుతుందో లేనప్పటికీ.. ఇది చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకుముందు కూడా.. ఎండలు ఎలా ఉన్నాయో అని దానికి కూడా రోడ్డుపై కోడి గుడ్లతో ఆమ్లెట్ వేసి చూపించారు. ఆ వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతుంది.

Read Also: T. Harish Rao: హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఈ వీడియో ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వీక్షించారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందించారు. “ఇలాంటి పనులతో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ప్రమాదం ఉందని.. వారు సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం ఎదుటి వారి జీవితాలతో ఆడుకోవద్దని”.. పలువురు నెటిజన్లు తెలుపుతున్నారు.

Exit mobile version