Suicide in Public Toilet: మహారాష్ట్రలోని థానే నగరంలో శనివారం 65 ఏళ్ల మహిళ పబ్లిక్ టాయిలెట్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది కుమారుడు చనిపోవడంతో ఆ మహిళ తన కుమార్తెతో కలిసి సాయినాథ్ నగర్‌లో నివసిస్తోంది. మధ్యాహ్నం సమయంలో పబ్లిక్ టాయిలెట్‌లో నిప్పంటించుకుంది. మరుగుదొడ్డి నుంచి పొగలు రావడం చూసిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నారని ఓ అధికారి తెలిపారు.
Snake Found In Plane: ఎయిరిండియా విమానంలో పాము కలకలం.. విచారణకు ఆదేశం
విపరీతమైన ఈ చర్య వెనుక ఉద్దేశమేంటో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఆ మహిళ గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేసిందని అధికారి తెలిపారు. తల్లి చనిపోవడంతో కుమార్తె రోధించిన తీరు అక్కడి వారిని కలచివేసింది.
