NTV Telugu Site icon

Morphing Photos: నిశ్చితార్థం చెడగొట్టేందుకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫోటోలు పంపిన మహిళ

Bihar

Bihar

Morphing Photos: కోడలు నిశ్చితార్థాన్ని చెడగొట్టేందుకు తనకు కాబోయే భర్తకు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపింది ఓ మహిళ. అంతేకాకుండా తన మాజీ ప్రేమికుడి సహాయంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. అనంతరం వారిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అంతకుముందు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ తో అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు బాధితురాలు తెలిపింది.

Read Also: West Bengal: బెంగాల్‌లో తీవ్ర హింస.. కేంద్రమంత్రి కాన్వాయ్‌పై దాడి..

కోడలి పరువు తీయాలనుకున్న నిందితురాలు.. శుభం అనే ఓ వ్యక్తి సలహా తీసుకుని.. ఒక నకిలీ Instagram IDని సృష్టించింది. అందులో అసభ్యకరమైన మెస్సేజ్ లతో పాటు ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపించారు. ఇలా మహిళకు సాయం చేసినందుకు నిందితురాలితో పాటు మరో వ్యక్తి శుభం కుమార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 20న మహిళ పోలీసులను ఆశ్రయించగా.. ఆ తర్వాత పోలీసులు చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్ ఐడి సర్వీస్ ప్రొవైడర్ నుండి సమాచారం కోరారు. శుభం మొబైల్ నుండి అభ్యంతరకరమైన విషయాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కోడలు చెప్పిన వాదనలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.