Site icon NTV Telugu

Heart : 16ఏళ్ల తర్వాత తన గుండెను తాను చూసుకుని అబ్బురపడిన మహిళ

Heart Transplant,museum,woman Visits Her Own Heart

Heart Transplant,museum,woman Visits Her Own Heart

Heart : ప్రపంచంలో చాలామంది ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో చనిపోతున్నారు. ఆ సయమంలో అవయవాలు దొరికితే వారి జీవితం నిలబడుతుంది. కొందరు దాతల పుణ్యమాని అలా అవయవాలు దొరికి జీవితంలో గెలిచినవారు ఎందరో ఉన్నారు. ఈ మధ్యకాలంలో అవమవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఓ మహిళకు 16ఏళ్ల క్రితం గుండెమార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దీంట్లో భాగంగా ఆమె శరీరం నుంచి తీసిన అసలైన గుండెను ఒక మ్యూజియంలో పెట్టారు. ఆ గుండెను ఆ మహిళ 16సంవత్సరాల తర్వాత చూసుకుంది. హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కు చెందిన జెన్నిఫర్ సుట్టన్, లండన్‌లోని హంటేరియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన తన స్వంత అవయవాన్ని చూడటంతో ఆశ్చర్య చకితురాలైంది.

Read Also:Niharika Konidela: ‘డెడ్ పిక్సెల్స్’…. డెడ్లీ సెటైర్!

ఈ క్రమంలోనే తన అనుభూతిని పంచుకుంది. ఆ మ్యూజియంలోకి అడుగుపెట్టి, దాన్ని చూడగానే తనకు కలిగిన మొదటి ఫీలింగ్.. ఒకప్పుడు తన శరీరంలోని భాగం.. తన జీవితానికి ఆధారం అనే ఫీలింగ్ కలిగిందన్నారు. “ఈ ఫీలింగ్ చాలా బాగుంది – నా స్నేహితుడిలా అనిపిస్తుంది. నాతోపాటు 22 సంవత్సరాలు ఉంది. నన్ను 22 సంవత్సరాలు బతికించింది. నిజంగా దీన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నేను నా జీవితకాలంలో ఇలా ఓ సీసాలో భద్రపరిచిన చాలా వాటిని చూశాను.. కానీ ఇది మాత్రం.. నాది అని అనుకోవడం చాలా విచిత్రంగా ఉంది, ”అని ఆమె చెప్పుకొచ్చారు.

Read Also:G20 summit: శ్రీనగర్ లో భారీ భద్రత.. డేగ కళ్లతో నిఘా

ఇది ఓ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఊహించని విచిత్రమైన బహుమతి అన్నారు. తను ఇప్పుడు చురుకుగా, బిజీగా జీవితాన్ని గడుపుతున్నానని “సాధ్యమైనంత కాలం బతకాలనుకుంటున్నానని” ఆమె తెలిపింది. ట్రెక్కింగ్, చిన్న చిన్న వ్యాయామాల లాంటివి చేయడం కూడా తనకు ఇబ్బందిగా ఉందని సుట్టన్ మొదటిసారి కనుగొన్నప్పుడు, ఆమె 22 ఏళ్ల విశ్వవిద్యాలయ విద్యార్థిని. వెంటనే డాక్టర్లను కలిస్తే ఆమెకు రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ అయిందని తేలింది. ఇది శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. గుండె మార్పిడి చేయించుకోకపోతే చనిపోతుందని వైద్యులు చెప్పారు. జూన్ 2007లో, ఆమెకు సరిపోయే గుండె దొరికిందని తెలుసుకుంది. దీని గురించి సుట్టన్ మాట్లాడుతూ “గుండె మార్పిడి తరువాత అంతా కొత్తగా అనిపించింది. నమ్మలేకపోయాను. నా ఫ్యామిలీకి డబుల్ ధంబ్స్ అప్ చూపిస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరిచాను. నేను సాధించాను. నేను సాధించాను.. అని చెప్పడం నాకింకా గుర్తు’ అని జ్ఞాపకం చేసుకున్నారు.

Exit mobile version