NTV Telugu Site icon

Marriage Proposal: 400మంది ప్రపోజ్ చేసినా ఆమెకు నిజమైన ప్రేమ దొరకడం లేదట?

New Project (25)

New Project (25)

Marriage Proposal: నేటి కాలంలో నిజమైన ప్రేమను కనుగొనడం చాలా కష్టం అని అంటారు. సోషల్ మీడియా యుగంలో ప్రజలు ఎక్కువగా టైమ్ పాస్ ప్రేమను పొందుతున్నారు. ఇది కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తరువాత ఆ జంట వేర్వేరు మార్గాల్లో వెళుతుంది. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు నిజమైన ప్రేమ కోసం అన్వేషణ సంవత్సరాలుగా కొనసాగడానికి ఇదే కారణం, కానీ వారు తమకు నచ్చిన భాగస్వామిని కనుగొనలేకపోయారు. ప్రస్తుతం అలాంటి ఓ మహిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె 55 సంవత్సరాల వయస్సులో నిజమైన ప్రేమ కోసం వెతుకుతోంది. కానీ ఆమె ఎవరికీ దొరకడం లేదు. పురుషులు ఆమెను ఇష్టపడరని కాదు. వందల మంది అబ్బాయిలు ఆమెకు ప్రపోజ్ చేశారు. కానీ ఇప్పటికీ ఆమె ఒంటరిగా ఉంది.

ఆ మహిళ పేరు ఫ్రాన్‌ సాయర్‌. ఆమె విడాకులు తీసుకుంది. ఇప్పటివరకు 400 మందికి పైగా పురుషులు తనను పెళ్లికి ప్రతిపాదించారని ఫ్రాన్ పేర్కొన్నారు, అయితే ఆమె వారందరికీ నో చెప్పింది. తనను ప్రపోజ్ చేసిన వారిలో 18 ఏళ్ల అబ్బాయిల నుంచి 35-40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, వృద్ధులు కూడా ఉన్నారని చెప్పింది. 18-21 ఏళ్ల అబ్బాయిలు ఆమెతో సంబంధాన్ని కలిగి ఉండాలనే కోరికతో ఉన్నారని, వారికి ప్రేమ భావాలు లేవని ఫ్రాన్ చెప్పింది.

Read Also:PF Interest Credit: ఈపీఎఫ్‎వో ఖాతాదారులు గుడ్ న్యూస్.. అందరి ఖాతాల్లో డబ్బులు జమ

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు కూడా పని చేయలేదు
ఫ్రాన్ తన మిస్టర్ రైట్‌ను కనుగొనడానికి అనేక ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లను కూడా ఉపయోగించానని, కానీ ప్రయోజనం లేకపోయిందని తెలిపింది. మొదట్లో మగవాళ్లంతా సరిగ్గా మాట్లాడేవారని, అయితే కొద్ది రోజుల్లోనే వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్‌ మారిపోతాయని చెప్పాడు. పురుషుల సంభాషణలను బట్టి వారు సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే మానసిక స్థితిలో లేరని, వారు కేవలం సమయం గడుపుతున్నారని స్పష్టమవుతుందని ఆమె చెప్పింది. ఫ్రాన్ రిలేషన్‌షిప్‌లో వెనక్కి తగ్గాలి. చాలా మంది పురుషులకు సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలతో ఎలా మాట్లాడాలో.. వారితో ఎలా ప్రవర్తించాలో తెలియదని ఫ్రాన్ చెప్పారు. సోషల్ మీడియాలో కూడా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇక్కడి ప్రజలు ఎవరి మనోభావాలను గౌరవించరని సోషల్ మీడియా ఏదో ఒకరోజు నిజమైన ప్రేమను నాశనం చేస్తుందని చెప్పింది.

Read Also:Chandra Mohan Death: చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్‌