Site icon NTV Telugu

Bathroom Thief: దొంగతనానికి వచ్చాడు.. ఆపుకోలేక ఎంజాయ్ చేశాడు

Bathroom

Bathroom

Bathroom Thief: అమెరికాలోని సీటెల్‌లో ఉన్న ఓ మహిళ తన ఇంటి వచ్చే సరికి దొంగతనం ప్రయత్నం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూసి కంగుతిన్నారు. దొంగతనానికి వచ్చిన దొంగ బాత్ రూంలో బాత్ టబ్ లో స్నానం చేస్తూ కనిపించాడు. వివరాల్లోకెళ్తే..34 ఏళ్ల మహిళ బయటకు వెళ్లి ఇంటికి తిరిగారాగానే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇంటి వాతావరణం చూస్తే కాస్త అనుమానాస్పదంగా అనిపిపించింది.

Also Read : Telangan Assembly: 24 గంటల విద్యుత్‌ సరఫరాతో రాష్ట్రంలో వెలుగులు.. సాఫీగా గవర్నర్‌ ప్రసంగం..

దీనికి తోడు ఇంటి కిటికి కూడా పగిలి ఉండటం..లోపల ఎవరో ఉన్నట్టు అనుమానం కలిగింది. అనుకున్నదే తడువుగా ఆమె పోలీసుకు కాల్‌ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాము ఇంటిని చుట్టుముట్టామని లోపల ఉన్నావాళ్లెవరో బయటకు రావాల్సిందిగా సూచించారు. అయితే ఎంతకీ అటు నుంచి స్పందన రాకపోవడంతో ఇల్లంతా గాలించడం ప్రారంభించారు పోలీసులు. చివరికి ఆ దొంగ బాత్‌టబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఐతే పోలీసులు లోపలకి వెళ్లి చూసేటప్పటికి.. ఆ దొంగ బాత్‌టబ్‌లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Also Read : Milk Price Hike: పాలధరలు మరోసారి పెంపు..లీటర్‌పై ఎంతంటే?

Exit mobile version