Site icon NTV Telugu

Vijayanagaram: తల్లి తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని.. ప్రియుడితో కలిసి కూతురు దారుణం!

Crime

Crime

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి పట్ల కర్కశంగా వ్యవహరించింది ఓ కూతురు. తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య చేయించందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో మహిళ కిడ్నాప్ అనంతరం మర్డర్ కు గురైంది. బహిర్భూమికి వెళ్లిన తల్లి కూతుర్లలో తల్లిని ఆటోలో వచ్చిన కూతురు ప్రియుడు ఎత్తుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Also Read:Top Hedlines @1PM : టాప్‌ న్యూస్‌

మధ్యాహ్నం అయ్యేసరికి వెంకటరమణపేట గ్రామ ప్రధాన రహదారి సమీపంలో నేల బావిలో వెంకట లక్ష్మి శవమై తేలింది. మెడకి రాయికట్టి నేలబావిలో పడేశాడు కూతురు ప్రియుడు హరికృష్ణ. తన ప్రేమ వివాహానికి అడ్డంగా ఉందని కూతురే తన ప్రియునితో హత్య చేయించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతురాలు వెంకటలక్ష్మి మర్డర్ కు కూతురు రుచిత, ప్రియుడు హరికృష్ణ పన్నాగమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version