NTV Telugu Site icon

Paris Olympics 2024: ఒలింపిక్స్ బరిలో మహిళా ఎమ్మెల్యే..పతకం ఖాయమని ధీమా!

Shreyasi Singh

Shreyasi Singh

మహిళలు.. ఇంటికే పరిమితం కాదని మరోసారి నిరూపితమైంది. ఓ మహిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ.. ఎమ్మెల్యేగా గెలుపొందింది. అంతే కాదు.. ఆమె క్రీడాకారిణి కూడా.. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ 2024కు హాజరయ్యారు. కచ్చితంగా పతకం సాధించి భారత్ కు గౌరవం తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు..బీహార్ రాష్ట్రంలోని జముయి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్‌. ఆమె షూటింగ్‌ క్రీడాకారిణి. అర్జున అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. డబుల్‌ ట్రాప్‌ విభాగంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకాన్ని, 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు.

READ MORE: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..

ఎమ్మెల్యే శ్రేయసి సింగ్‌ గిదౌర్‌ లో జన్మించారు. దిల్లీలోని హన్స్‌రాజ్‌ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆపై ఫరీదాబాద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటీలో ఎంబీఏ పట్టాపొందారు. 2020లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. అదే ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జముయి నియోజకవర్గం పోటీ చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయ్‌ ప్రకాష్‌పై 41 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఆమె బిహార్‌ మాజీ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ కుమార్తె. తల్లి పుతుల్‌ సింగ్‌ బంకా నియోజకవర్గ ఎంపీ. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో రాణించడంతో ఆమె కూడా ఆ దిశగా అడుగులు వేశారు. క్రీడల్లో కూడా బాగా రాణిస్తు్న్నారు.