Site icon NTV Telugu

58 ఏళ్లు బంధం ; అద్భుతం చేసిన ఫేస్‌బుక్‌

ఫేస్‌బుక్‌ ఓ అద్భుతం చేసింది. 58 ఏళ్ల క్రితం దూరమైన.. తండ్రి… కూతూరిని కలిపింది. ఇదోదే సినిమా కథలా ఉంది కదా..! కాని రియల్‌ సీన్‌. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఎక్కడ జరిగింది? ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా సొషల్‌ మీడియా వినియోగం పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది నెట్టింటే విహరిస్తుంటారు. నిత్యం ఫేస్‌బుక్‌,ఇన్‌స్ట్రాగ్రామ్‌లలలో మునిగి తేలుతుంటారు నెటిజన్లు. వీటి వల్ల ఎంతైతే నష్టాలు ఉన్నాయో.. అంతే లాభాలు ఉన్నాయ్‌. ఫేస్‌బుక్‌ సహాయంతో ఓ మహిళ ఏకంగా 58 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంది.

దీంతో ఆమె సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఇంగ్లండ్‌, లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్‌ అనే మహిళ ఏడాది వయసులో తండ్రి నుంచి దూరమైంది. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడంతో తండ్రిని జాడ తెలుసుకోలేకపోయింది. కానీ చనిపోయేలోపు ఎలాగైనా తన తండ్రిని చూడాలనుకుంది. ఆమె చేసిన ప్రయత్నాలకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి వెనకడుగు వేయలేదు.

తెలిసిన అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించింది.అయితే ఓ రోజు జూలీకి ఓ ఐడియా వచ్చింది. ఒంటరిగా ప్రయత్నించడం కంటే.. సోషల్‌మీడియా సాయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంది. ఈ ఆలోచన రాగానే తండ్రి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాలని నెటిజనులు కోరింది. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత తండ్రి ఆచూకీ పై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు ప్రత్యేక్షమైంది. దీంతో వెళ్లి తన తండ్రిని కలుసుకుంది.

Exit mobile version