Site icon NTV Telugu

Woman With Gun: గన్ తో విలన్ లా హడావుడి చేసిన మహిళ… పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

New York Copy

New York Copy

Woman With Gun: అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతుంది. దీనికి అద్దం పట్టే మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ నడిరోడ్డుతో హల్ చల్ చేస్తూ అక్కడ ఉన్నవారికి కాసేపు గుండెపోటు తెప్పించింది. ఈ ఘటన న్యూయార్క్ లో జరిగింది. అయితే చాకచక్యంగా పోలీసులు ఆమెను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల ప్రకారం న్యూయార్క్‌ సమీపంలోని నాస్సౌ కౌంటీలో ఓ 33 ఏండ్ల మహిళ తుపాకీతో హల్ చల్ చేసింది. చేతిలో తుపాకీ పట్టుకొని సినిమాలో చూపించిన విలన్ లాగా గన్ ను అటుపక్కవారికి , ఇటు పక్కవారికి చూపెడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు న్యూయార్క్ లోని నస్సౌ కౌంటీలోని నార్త్‌ బెల్మోర్‌లో జరిగింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఎంతో తెలివిగా ఆమెను పట్టుకున్నారు. అయితే వీడియోలో ఒక సందర్భంలో ఆమె తనను తాను కాల్చుకోవడానికి కూడా గన్ ను తలకు గురిపెట్టుకోవడం చూడవచ్చు. ఆ మహిళ ఎందుకు అలా చేసిందో ఎవ్వరికి అర్థం కాలేదు.

Also Read:Bus Catches Fire: వీళ్లు నిజంగా అదృష్టవంతులే.. లేకపోతే ప్రాణాలు పోయేవే

అయితే పోలీసులు ఆమెను పట్టుకున్న తీరు మాత్రం అద్భుతం అనిపిస్తోంది. వేగంగా వచ్చిన పోలీసులు కారుతో ఆమెను మొదట ఢీ కొట్టారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఆమె చేతిలోని గన్ కూడా నేలపై పడిపోయింది. దీంతో వెంటనే పోలీసులు వేగంగా వచ్చి ఆమెను నేలపై పడేసి కాళ్లు చేతులు గట్టిగా పట్టుకొని బంధించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది వీడియో చూస్తుంటే ఓ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఎవరికి ఏం కాకుండా కాపాడారంటూ మెచ్చుకుంటున్నారు. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియో వైరల్ గా మారింది.

Exit mobile version