NTV Telugu Site icon

Instagram Job Scam: ఒకే ఒక్క క్లిక్‎తో రూ.8.6లక్షలు స్వాహా.. ఉద్యోగం పేరుతో మోసం

Instagram

Instagram

Instagram Job Scam: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. కరోనా సయమంలోనే చాలామంది ఉద్యోగాలు పొగొట్టుకుని దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు మాంద్యం భయాలు ఇటు ఉద్యోగులు, నిరుద్యోగులను కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫలానా చోట ఉద్యోగం ఉంది అనగానే వేయి ఆశలతో నిరుద్యోగులు ప్రయత్నించడం మొదలుపెడుతున్నారు. వారి దయనీయస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉద్యోగ ప్రకటన కనిపించగానే వివరాలు తెలుసుకునేందుకు దానిపై క్లిక్ చేసింది. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఆ యువతి 8.6 లక్షల రూపాయలకు పైగా కోల్పోయింది. దీంతో లబోదిబోమనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.

Read Also: Ashika Ranganath: ఈ బ్యూటీ బాగానే ఉంది కానీ సాలిడ్ బ్రేక్ రాలేదు…

మహిళ బ్యాంకు నుంచి రూ.8.6 లక్షలు సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. డిసెంబరులో చేసిన ఈ ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటన చూసి లింక్‌ను తెరిచాక ఆమె ‘ఎయిర్‌లైన్‌జోబల్లిండియా’ అని పిలువబడే మరో ఐడీకి మళ్లించబడింది. వారు అడిగిన వివరాలను ఫార్మాట్‌లో నింపింది. ఆ తర్వాత రాహుల్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ముందుగా 750 రూపాయలు ‘రిజిస్ట్రేషన్ ఫీజు’గా డిపాజిట్ చేయాలని అతడు కోరాడు. దీని తరువాత, అతను తన ఖాతాకు 8.6 లక్షల రూపాయలకు పైగా ‘గేట్ పాస్ ఫీజు, ఇన్సూరెన్స్, సెక్యూరిటీ డబ్బు’గా బదిలీ చేయమని కోరగా, ఆమె పంపింది. అయితే అతడు మరింత డబ్బు అడగడంతో ఏదో తప్పు జరిగిందని ఆ మహిళ గ్రహించి పోలీసులకు సమాచారం అందించింది. ఢిల్లీ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం డీసీపీ సంజయ్ సైన్‌ను స్పందిస్తూ “హర్యానాలోని హిసార్ నుంసీ ఎక్కువ డబ్బు ఉపసంహరించుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది. నిందితుల మొబైల్ ఫోన్ కూడా అదే రాష్ట్రంలో ఉంది. అనంతరం బృందం సభ్యులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు’’ అని తెలిపారు. కోవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగం కోల్పోయారు. అప్పటి నుంచే ఇలాంటి మోసాలు చేయడం ప్రారంభించినట్లు పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు.