Site icon NTV Telugu

Crime News: ఫామ్‌హౌస్‌లో మహిళ దారుణహత్య.. కత్తితో పొడిచి చంపిన దుండగులు

Farmhouse

Farmhouse

Crime News: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో గల ఫామ్ హౌస్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఫామ్ హౌస్‌లో కాపలాగా ఉండే మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి హత్యచేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి- శైలజా రెడ్డి దంపతులు దాసర్లపల్లి సమీపంలో ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో శైలజా రెడ్డి ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను కత్తితో పొడిచి చంపారు. కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: China: అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!

శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో శైలజ సర్వెంట్‌ క్వార్టర్‌లో ఉండగా.. సురేందర్‌ ఫామ్‌హౌస్‌ భవనంలో ఉన్నాడు. అక్కడికి వచ్చిన యజమాని కుటుంబసభ్యులతో సురేందర్ ఉన్నాడు. ఆ సమయంలో కుక్కలు చాలాసేపు మొరగడం విని సురేందర్ తన గదిలోకి పరుగెత్తాడు, అక్కడ తన భార్య రక్తపు మడుగులో చనిపోయి పడి ఉండడాన్ని గమనించాడు. కొందరు వ్యక్తులు కత్తితో మహిళను హత్య చేశారు అని ఏసీపీ మహేశ్వరం, సీ అంజయ్య తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్‌, క్లూస్‌ టీం సాయంతో విచారణ చేపట్టారు. దుండగుడిని గుర్తించి పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

Exit mobile version