Site icon NTV Telugu

Woman Beard: గడ్డంతో గిన్నీస్ రికార్డు.. అతను కాదు.. ఆమే

Beard

Beard

సాధారణంగా మగవాళ్లకు గడ్డం ఉంటుంది, పెంచుకుంటారని తెలుసు. ఇదేంటి ఓ మహిళ గడ్డం పెంచుకుందా అని ఆశ్చర్యపోతున్నారా.. అది కూడా అత్యంతంగా గడ్డం పెంచి గిన్నీస్ వరల్డ్ బుక్ లో చోటు దక్కించుకుంది. ఆ విషయానికొస్తే.. అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హానీకట్ అనే మహిళ అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమేకు 11.8 ఇంచుల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు.

Tamil Nadu CM Stalin: మోడీ తమిళ్ భాషను తొక్కేస్తున్నారు..

చిన్నప్పటి నుంచే ఆ మహిళకు జన్యుపరమైన సమస్యలు ఉండేవి. అయితే 13 సంవత్సరాలు వచ్చే నాటికి ఆమెకు గడ్డం పెరగడం మొదలైంది. మగవారిలా గడ్డం పెరుగుతుండటంతో హనీకట్ తీవ్రంగా ఆందోళన చెందింది. దీంతో రోజుకు మూడు నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేదాన్ని అని ఎరిన్ హనీకట్ తెలిపారు. అవాంఛిత రోమాలను తొలగించేందుకు రకరకాల క్రీములు, జెల్ లు వాడానని.. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆమెలో మానసిక సంఘర్షణ మొదలైంది. ఇంటినుంచి బయటకి రాలేక కొన్నాళ్లపాటు నరకం అనుభవించింది. ఆమె పరిస్థితిని గమనించిన స్నేహితులు, బంధువులు గడ్డం ఉంటే తప్పేంటి, ఇలా ఇంకా అందంగా ఉన్నావంటూ ప్రోత్సహించేవారు.

Sandeham: ‘సందేహం’గా ఉందంటున్న హెబ్బా పటేల్.. ‘మనసే మరలా’ సాంగ్ రిలీజ్

ఓ వైపు జన్యుపరమైన సమస్యలు వేధిస్తుంటే.. మరోవైపు బాక్టీరియా సోకి ఆమె కాలును కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఆమెలో తీరని ఆవేదనను మిగిల్చింది. సామాజికంగా ఎన్నో అవాంతరాలు ఎదురైనా, వాటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లారు హనీకట్‌. ఫిబ్రవరి 8నే ఆమె పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డు నెలకొల్పినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. రెండు రోజుల క్రితమే అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లానని హనీకట్‌ తెలిపారు. తాను సాధించిన ఈ రికార్డు వైద్యం చేయించుకునేందుకు ఏదో ఒక రూపంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ఈ రికార్డును అంకితమిస్తున్నట్లు వెల్లడించారు.

 

Exit mobile version