Site icon NTV Telugu

Zomato Viral : జొమాటోలో నూడిల్స్ ఆర్డర్ చేస్తే.. వేడి వేడి బొద్దింక వేసి డెలివరీ చేశారు

New Project (93)

New Project (93)

Zomato Viral : ప్రస్తుతం దాదాపు ప్రతి పని ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. ఎవరికైనా డబ్బు పంపాలనుకున్నా లేదా ఎక్కడి నుండైనా డబ్బు అడగాలనుకున్నా లేదా ఏదైనా వస్తువు కొనాలనుకున్నా. ఇప్పుడు ప్రజలు ఇంట్లో కూర్చొని ప్రతిదీ చేసేయవచ్చు. మీకు ఏది తినాలని అనిపిస్తే వెంటనే ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ని ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తే.. నిమిషాల్లో మీకు నచ్చిన ఫుడ్ ఇంటికే వచ్చేస్తుంది. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ కంపెనీలు భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ రోజు వేలాది మంది ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు. కొన్ని కొన్ని సార్లు ఈ ఆన్‌లైన్ వ్యాపారంలో చాలాసార్లు ప్రజలు మోసపోతున్నారు. త్రిపురకు చెందిన ఓ మహిళ విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read Also:Russia President: మై డియర్ ఉమెన్స్.. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి

ఆ మహిళ ఫుడ్ డెలివరీ యాప్ Zomato నుండి జపనీస్ మిసో రామెన్ చికెన్‌ని ఆర్డర్ చేసింది. ఇది ఒక రకమైన నూడుల్స్. దీనిని జపనీస్ ప్రజలు ఇష్టంగా తింటారు. కానీ ఇప్పుడు ఈ ఆహారం భారతదేశంతో సహా అనేక ఇతర దేశాల ప్రజలకు బాగా నచ్చింది. ఆమె ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెలివరీ బాయ్ ఫుడ్ అందించాడు. తిందామని దాన్ని తెరచి చూడగానే అందులోని అసహ్యకరమైన విషయం చూసి ఆమెకు వాంతులయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆహారంలో చనిపోయిన బొద్దింక కనిపించింది. ఈ సంఘటనతో బాధపడ్డ మహిళ వెంటనే దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు మొత్తం ఘటనను వివరించింది.

Read Also:Coach Jai Simha: కోచ్ జై సింహా వెనకాల కొంత మంది ఉన్నారు.. సస్పెండ్ చేస్తే సరిపోదు!

నూడుల్స్ లోపల చనిపోయిన బొద్దింక కనిపించడం మీరు చిత్రంలో చూడవచ్చు. ఆ మహిళ తన పోస్ట్‌లో ఇలా రాసింది, ‘జొమాటో యాప్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం ద్వారా నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. జపనీస్ మిసో రామెన్ చికెన్‌ని ఆర్డర్ చేశాను. నా ఆహారంలో బొద్దింక ఉంది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై ప్రజలు కూడా రకరకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ఈ విషయంలో చాలా మంది వినియోగదారులు Zomatoకి మద్దుతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇందులో జొమాటో తప్పు లేదని అలాంటి ఆహారాన్ని ప్యాక్ చేసి పంపిన రెస్టారెంట్ తప్పిదమని యూజర్లు చెబుతున్నారు. జొమాటో కూడా ఈ విషయంలో స్పందించింది. ఈ దురదృష్టకర సంఘటన గురించి విన్నందుకు మాకు చాలా బాధగా ఉంది. దయచేసి దర్యాప్తు చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వండని పేర్కొంది.

Exit mobile version