Site icon NTV Telugu

Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. భోజనంలో రాయి.. ఫోటో వైరల్

Air India

Air India

Air India: విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో విమర్శలను ఎదుర్కొంటోన్న ఎయిరిండియా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె నెట్టింట షేర్ చేసింది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 8న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా విమానంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైనట్లు శార్వప్రియ సంగ్వాన్ అనే మహిళ ట్వీట్ చేసింది. “విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా” అని శార్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు.

China Warns: జాగ్రత్తగా ఉండండి.. జపాన్‌తో స్నేహంపై ఆస్ట్రేలియాకు చైనా వార్నింగ్

ఈ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఎయిరిండియాపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎయిరిండియాను తప్పుపడుతూ నెటిజన్లు రెచ్చిపోయారు. ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా సంస్థ.. మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజా ఘటనపై ఎయిరిండియా స్పందించింది. ‘‘ఇది ఆందోళనకర విషయమే. దీని గురించి కేటరింగ్‌ టీంతో మాట్లాడుతున్నాం. మీ సమస్యను పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వండి. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఎయిరిండియా ఆమె ట్వీట్‌కు బదులిచ్చింది.

 

Exit mobile version