NTV Telugu Site icon

Chocolate Syrup: చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక.. ఫిర్యాదుపై స్పందించిన కంపెనీ

Chocolate Syrup

Chocolate Syrup

Chocolate Syrup: ఇటీవల ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ప్యాకెట్లలో పాములు, ఎలుకలు, మానవుని వేళ్లు వస్తున్నాయి. ఇటీవల ముంబై నివాసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మానవ వేలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్శిల్ లో పాము కూడా వచ్చింది. ఇక మరో ఆన్ లైన్ ఆర్డర్ లో చనిపోయిన ఎలుక బయటపడింది. అవును జెప్టో ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుకను గుర్తించిన ఒక మహిళ పూర్తిగా షాక్ కు గురైంది. ప్రమీ శ్రీధర్ అనే మహిళ చాక్లెట్ సిరప్ లో ఎలుక వచ్చిన సంఘటనను వీడియోలో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు హెర్షీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆమె ఫిర్యాదుపై కంపెనీ స్పందించింది. హెర్షీ కంపెనీ బ్రాండ్ ఇలా రాసుకొచ్చింది. “హాయ్, దీన్ని చూసి మేము చాలా చింతిస్తున్నాము. దయచేసి మాకు యూపీసీ, తయారీ కోడ్‌ను బాటిల్ నుంచి consumercare@hersheys.com రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపండి, తద్వారా మా బృంద సభ్యులలో ఒకరు మీకు సహాయం చేయగలరు!” అని హెర్షీ కంపెనీ సమాధానం ఇచ్చింది.

Read Also: WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..

ప్రమీ శ్రీధర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వీడియో పోస్ట్ చేసి దాని కింద వివరాలను వెల్లడించారు. జెప్టో ఆర్డర్ లో షాకింగ్ సంఘటన ఒకటి చోటుచేసుకుందని.. సిరప్ ను ఒక కప్పులో పోయగా అందులో ఒక చనిపోయిన ఎలుక వచ్చిందని వెల్లడించారు. హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి జెప్టోలో ఆర్డర్ చేశామని చెప్పారు. కేక్ పై పోస్తుండగా నల్లని వెంట్రుకల లాంటి పదార్థం వచ్చిందని, ఈ క్రమంలో సిరప్ ను డిస్పోజబుల్ గ్లాసులో పోసి చూడగా చనిపోయిన ఎలుకగా గుర్తించామన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు కూడా అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హెర్షే కంపెనీపై దావా వేయొచ్చని, ఆహార భద్రత డిపార్టుమెంట్ వారికి ఫిర్యాదు చేయొచ్చని ఓ నెటిజన్ చెప్పారు. జెప్టో ఇక్కడ తప్పు చేయనందున హర్షేపై ఫిర్యాదు చేయమని పలువురు ఇతరులు ప్రమీ శ్రీధర్ ను కోరారు.