NTV Telugu Site icon

Varanasi Airport : మహిళ మృతి అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం

New Project 2023 12 26t110317.245

New Project 2023 12 26t110317.245

Varanasi Airport : దర్భంగా నుంచి ముంబై వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. సాయంత్రం వారణాసి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మహిళా ప్రయాణికురాలు తన మనవడితో కలిసి దర్భంగా నుంచి ముంబైకి వెళ్తున్నట్లు సమాచారం. విమానం గాలిలో ఉండగానే ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Read Also:Governor Tamilisai: నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై.. లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీపై షాతో చర్చ..!

వారణాసి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే వైద్యబృందం మహిళను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు మహిళ చనిపోయినట్లు నిర్ధారించారు. సమాచారం ప్రకారం, స్పైస్‌జెట్ విమానం (SG 116) దర్భంగా విమానాశ్రయం నుండి ముంబైకి వెళుతోంది. విమానం గాలిలో ఉండగానే బీహార్‌కు చెందిన కళావతి దేవి అనే 85 ఏళ్ల వృద్ధురాలి ఆరోగ్యం క్షీణించింది.

Read Also:CM YS Jagan: గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కలకలం సృష్టించిన ఫ్లెక్సీ!

మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో సిబ్బంది వైద్య అత్యవసర పరిస్థితిని పేర్కొంటూ వారణాసి విమానాశ్రయంలోని ఏటీసీని సంప్రదించారు. ఏటీసీ నుంచి అనుమతి లభించడంతో విమానాన్ని దారి మళ్లించి సాయంత్రం 6 గంటలకు వారణాసి బబత్‌పూర్‌ విమానాశ్రయంలో దించారు. చికిత్స కోసం ప్రయాణికుడిని వైద్య బృందానికి అప్పగించిన తర్వాత, విమానం వారణాసి నుండి ముంబైకి రాత్రి 7.25 గంటలకు బయలుదేరింది. మహిళా ప్రయాణికురాలు తన మనవడితో కలిసి దర్భంగా నుంచి ముంబైకి వెళ్తున్నట్లు స్పైస్‌జెట్ స్థానిక మేనేజర్ రాజేష్ సింగ్ తెలిపారు.

Show comments