Moneylenders Harassment: వడ్డీ వ్యాపారుల అరాచకాలు రాష్ట్రంలో మళ్లీ చవిచూస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో వడ్డీ వ్యాపారుల వేధింపులు విషాదానికి దారితీశాయి. అప్పులబారిన పడిన పూజారి భార్య కృష్ణవేణి (మహిళ) వడ్డీ వ్యాపారుల నుంచి ఎదురైన మానసిక వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది.
Brooklyn Shooting: కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్.. స్పాట్‌లో ముగ్గురు మృతి
అందిన సమాచారం ప్రకారం.. సదరు మహిళా నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. సూసైడ్ ముందు మహిళా లేఖతో పాటు సెల్ఫీ వీడియోలో కూడా విషయాన్నీ తెలిపింది. పురుగుల మందు తాగిన విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించి తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్న కృష్ణవేణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు, విజయవాడకు చెందిన ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. మహిళ ప్రాణాలు బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
