Site icon NTV Telugu

Flight : ప్యాంట్ విప్పమన్నాడు.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మహిళ ఆరోపణ

New Project (21)

New Project (21)

Flight : ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణంలో తరచూ విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్యాసింజర్లు పక్క వారిపై మూత్రం పోయడం వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లాంటి వార్తలు వింటూనే విన్నాం. అలాంటి ఘటన మరొకటి తాజాగా చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టుకు వెళ్లిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తనను అందరి ముందు ప్యాంట్ ఇప్పాలంటూ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇబ్బందిపెట్టారని మహిళ వాపోయింది. వారి కారణంగా తాను ఎయిర్ పోర్టులో ప్యాంట్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పింది. హాస్యనటి క్రిస్సీ మేయర్ తన స్నేహితురాలు కీను థాంప్సన్‌తో కలిసి అమెరికన్ ఎయిర్‌లో ప్రయాణిస్తున్నారు.

Read Also: YS Viveka Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

ఈ క్రమంలో వారు విమానం ఎక్కే ముందు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మెంబర్‌ని డీసెంట్ బాటమ్ వేర్‌గా మార్చమని సూచించారు. మీరు ధరించిన ప్యాంట్ బాలేదు, మరోటి వేసుకోవాలని వారు చెప్పారు. దీంతో తాను అందరి ముందు ప్యాంట్ మార్చుకున్న తర్వాత లోపలికి అనుమతించారని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో షేర్ చేసి అమెరికన్ ఎయిర్ ఎయిర్ లైన్స్ ని ట్యాగ్ చేసింది. తాను ప్యాంట్ మార్చుకోవడానికి ముందు ధరించిన ప్యాంట్ తో ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. వాళ్లు అలా చేయడం తనకు చాలా అవమానకరంగా అనిపించిందని తన బాధను వ్యక్తం చేసింది. బాటమ్ వేర్ మార్చడానికి ముందు, తర్వాత ఫోటోలను ఆమె షేర్ చేశారు. కాగా క్రిస్పీ మేయర్ ట్వీట్ కి సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది స్పందించారు. ఆమె ఎదుర్కొన్న సంఘటన చాలా బాధకరమని చెప్పారు. అయితే.. తనకు ఎదురైన సందర్భాన్ని తమ ఎయిర్ లైన్స్ కి డైరెక్ట్ మెసేజ్ చేయాలని వారు ఆమెను కోరారు.

Read Also:Vivek Agnihotri : మేము అలా చేస్తాం కాబట్టే.. మా ఇద్దరిని టార్గెట్ చేశారు

Exit mobile version