NTV Telugu Site icon

Woman and Goat Video: నిజాయితీకి మారుపేరులా ఉంది ఈ పెద్దావిడ.. ట్రైన్ లో ఏం చేసిందంటే?

Ticket

Ticket

Woman Buys Train Ticket to her Goat: సాధారణంగా ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు కొంతమంది అస్సలు టికెట్ తీసుకోరు. డబ్బులు ఉన్నా కూడా పట్టుకున్నప్పుడు చూద్దాంలే అన్నట్లు కొందరు టికెట్ కొనకుండానే ప్రయాణిస్తుంటారు. ఇక మరి కొందరు వారితో పాటు పిల్లల్ని తీసుకువచ్చేటప్పుడు కూడా హాఫ్ టికెట్ కొనాల్సి ఉండి కూడా కొనరు. పిల్లల వయసును తక్కువ చెబుతూ ఉంటారు. కొన్ని డబ్బులు చెల్లించి టికెట్ కొనే విషయంలో కూడా నిజాయితీగా ప్రవర్తించరు. అలా  చాలా మంది టికెట్ ఎగ్జామినర్స్ వచ్చినప్పుడు దొరికిపోయి ఫైన్ లు కడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ పెద్దావిడ ఎంతో నిజాయితీగా ప్రవర్తించింది. ఆమెతో పాటు తీసుకువెళుతున్న మేకకు కూడా టికెట్ తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Bear and Tiger Viral Video: పులిని ఫాలో అయిన ఎలుగుబంటి.. అది తిరిగి చూసే సరికి ఏం చేసిందంటే?

ఆ వీడియోను డి ప్రశాంత్ నయ్యర్ అనే యూజర్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. “ఈవిడ ట్రైన్ లో ప్రయాణిస్తున్నందకు తనతో పాటు తన మేకకు కూడా టికెట్ తీసుకుంది. టికెట్ ఎగ్జామినర్ అడుగుతున్నప్పుడు ఆమె నిజాయితీతో ఎంత గర్వంగా సమాధానం చెబుతుందో చూడండి” అంటూ కాప్షన్  జోడించారు. ఇక ఈ వీడియోలో టికెట్ కలెక్టర్ వచ్చి ఓ పెద్దావిడని టికెట్ అడుగుతాడు. ఆవిడ ఆమెతో పాటు వచ్చిన ఒకతన్ని టికెట్ చూపించూ అని అడుగుతుంది. అది చూసిన టికెట్ టీఈటీ ఏంటి మేకకు కూడా టికెట్ తీసుకున్నారా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. అందుకు ఆ మహిళ చిరునవ్వుతో అవును సార్ అంటూ సమాధానం ఇస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె నిజాయితీకి మారుపేరులా ఉందంటూ కొనియాడుతున్నారు. తమ కోసమే టికెట్ తీసుకోవడానికి ఆలోచించే ఈ కాలంలో ఆమె మేకకు కూడా టికెట్ తీసుకోవడం సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

Show comments