పాములను చూడగానే మనకు సల్ల చెమటలు పడుతాయి. కొందరు అక్కడ నుంచి పరారైపోతారు. అయితే కొందరు మాత్రం దైర్యం చేసి.. టెక్నిక్ తో పాములను పట్టుకుంటారు. అయితే ఓ మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద కొండ చిలువను పట్టుకుంది. కొద్ధి సేపటికి ఆ కొండచిలువ ఆమెపై ఎటాక్ చేయడంతో.. కొండ చిలువను వదిలేసింది. దీంతో కొండ చిలువ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక పెద్ద కొండచిలువను పట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూస్తున్న సేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొద్ధి సేపటికే భయాందోళనకు గురవుతారు. ఈ వీడియోలో, చీర కట్టుకున్న ఒక మహిళ కొండచిలువ తోకను చాకచక్యంగా పట్టుకుంది. అయితే కొండచిలువ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఒక్కసారిగా భయపడిన యువతి.. పాము తోకను వదిలిపెట్టింది. దీంతో ఆ కొండచిలువ నెమ్మదిగా పొదలలోకి జారుకుంది.
అయితే.. ఆ మహిళ పట్టు వదలలేదు. ఆమె మళ్ళీ కొండచిలువ తోకను పట్టుకుని పొదల నుండి బయటకు లాగింది. అనంతరం మళ్లీ పొదల్లోకి వెళుతున్న కొండ చిలువను లాగి బయటకు తీసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏం గుండెరా అది.. ఆ గుండె వందేళ్లు బతకాలి అంటూ కామెంట్లు పెట్టారు. మరి కొందరు వండర్ ఉమెన్ గా అభివర్ణించారు.
