మనం ఓ ఇళ్లు కొనాలంటే నానా కష్టాలు పడుతాం.. లేదా లక్షలు కొట్లు పెట్టి కొంటాం.. అలాంటి యుగంలో ఓ మహిళ కేవలం రూ. 270 కే మూడు ఇళ్లను కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటలీలో ఓ మహిళ పాడుబడిన ఇళ్లను జస్ట్ రూ.270 కొనుగోలు చేసింది. రూబియా డేనియల్స్ అనే 49 సంవత్సరాల మహిళ ఇటలీలోని సీసీలీలో కేవలం $3.30 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.270) కు మూడు ఇళ్లను కొనుగోలు చేసింది.
Also Read : Mehbooba Mufti: జీ 20ని బీజేపీ హైజాక్ చేసింది.. ఆర్టికల్ 370 తెచ్చేవరకు పోటీ చేయను..
కాలిఫోర్నియాకు చెందిన రూబియా డేనియల్స్ మూడు రోజుల పాటు వెతికి పట్టుకుని మరీ ఈ ఇళ్లను కొనుగోలు చేసినట్లు చెప్పింది. కోవిడ్ సమయంలో ఇటలీలో జనాభా బాగా తగ్గిపోయింది. సీసీలీలో పట్టణాన్ని మళ్లీ పునరుజ్జీవింపచేసే ప్రయత్నంలో $1 కంటే తక్కువ ధరకు ఇళ్లను అమ్ముతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇళ్లను కొనుగోలు చేసిన తిరిగి వాటికి రిపేర్లు చేయించుకోవాలంటే కనీసం రూ.20 నుంచి రూ.70 లక్షలు ఖర్చవుతుందట. ఇక్కడి రేట్ల గురించి ఎంక్వైరీ చేసుకున్న రూబియా చౌక ధరకు ఇళ్లను కొనుగోలు చేసింది.
Also Read : Thalapathy68: అక్కినేని వారసుడుకు ప్లాప్ ఇచ్చినా మంచి ఛాన్సే పట్టేశాడే
ఈ పాడుబడిన ఇళ్లను అందమైన ఇళ్లుగా మార్చేందుకు రూబియా డేనియల్స్ ప్రణాళికలు వేసిందట. ఒకటి తనకు గెస్ట్ హౌస్‌గా.. మరోకటి ఇంటిని ఆర్ట్ గ్యాలరీలాగ.. మూడవ ఇంటిని వెల్నెస్ సెంటర్‌గా మార్చాలని ఆమె అనుకుంటోందట. ఇంత ప్లాన్ చేసి మూడు ఇళ్లను కొనుగోలు చేసిన రూబియా నిజంగా చాలా తెలివైన మహిళ అని ఈ విషయం తెలిసిన వాళ్లు అంటుననారు.
