Site icon NTV Telugu

OMG: ఓరి దేవుడా! ఎయిర్‌పోర్టులో మసాలా మ్యాగీ.. రూ.193

Woman Bought Maggi

Woman Bought Maggi

OMG: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ మ్యాగీ తెలిసే ఉంటుంది. ఇది తక్షణ ఆకలిని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రజలు విపరీతంగా ఆకలిగా అనిపించినప్పుడల్లా వారు నీటిని వేడి చేసి, మ్యాగీని రెండు నిమిషాల్లో తయారు చేసుకుంటారు.ఒకప్పుడు మ్యాగీ ప్యాకెట్ రూ.10కి లభించేది. ఆ తర్వాత దాని ధర రూ.12కి పెరిగింది, ఇప్పుడు దాని ధర రూ.14కి పెరిగింది. అయితే ఒక్కసారి ఊహించుకోండి మ్యాగీ ప్యాకెట్ రూ.180-190 పలుకుతుందా? అవును ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటిదే జరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ రూ.193కి మసాలా మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌ను తిని, దాని బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. మ్యాగీ ధర ఇంత ఎక్కువగా ఉంటుందంటే ప్రజలు నమ్మలేకపోతున్నారు. బిల్లులో మసాలా మ్యాగీ ధర రూ.184 అని, జీఎస్టీని జోడించిన తర్వాత దాని ధర రూ.193గా మారింది. మ్యాగీ తిన్న తర్వాత, ఆ మహిళ UPI మోడ్ ద్వారా చెల్లించింది. బిల్లు తీసుకున్న తర్వాత ఆమె మొదట దాన్ని ఫోటో తీసి తన ట్విట్టర్ ఐడిలో షేర్ చేసింది.

Read Also:TS Rain: తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ఆ మహిళ పేరు సెజల్ సూద్. ఈ బిల్లును ట్విట్టర్‌లో షేర్ చేస్తూ సెజల్ ఇలా రాశారు, ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో రూ.193కి మ్యాగీని కొన్నాను. ఎలా స్పందించాలో నాకు తెలియదు, ఎవరైనా ఇంత ఎక్కువ ధరకు మ్యాగీని ఎందుకు విక్రయిస్తారు. ఈ బిల్లును చూసిన ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారని ఒక వినియోగదారు అడిగారు. దానికి సమాధానంగా.. సెజల్ తనకు రెండు గంటలుగా బాగా ఆకలివేయడంతో కొనవలసి వచ్చిందని చెప్పింది.

అదే సమయంలో, మరొక వినియోగదారు మాట్లాడుతూ, ‘ఇండిగో విమానాలలో కూడా ఇది రూ. 250కి అమ్ముడవుతోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారుల ప్రయాణికుల జేబులను కాపాడటానికి ధరలపై పరిమితి విధించాలి. అది లేకపోవడం వల్లే తాము ఇంటినుంచి ఆహారంతో విమానాశ్రయానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు వినియోగదారులు పేర్కొ్ంటున్నారు.

Read Also:Tomato: పెరుగుతున్న టమాటా దొంగతనాలు.. యూపీలో 25కిలోలు ఎత్తుకెళ్లిన దొంగలు

Exit mobile version