NTV Telugu Site icon

Illegal Sale of Ganja: గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు.. 1.57కిలోల సరుకు పట్టివేత

Ganja

Ganja

Illegal Sale of Ganja: హైదరాబాద్‌లోని ఫతేనగర్‌ ప్రాంతంలో ఒక మహిళ గంజాయి ప్యాకెట్లు అమ్మకాలు జరుపుతుండగా ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఫతేనగర్‌లో షేక్‌జామీన్‌ బీ అనే మహిళ గంజాయిని అమ్మకాలు సాగిస్తోంది. రూ. 300 ఒక ప్యాకెట్‌గా కొని రూ. 500కు ఒక ప్యాకెట్‌ చొప్పున గంజాయిని అమ్మకాలు జరుపుతోందని ఎస్‌ఎఫ్‌టీ ఎస్సై బి.బాలరాజు తెలిపారు. పురానాపూల్‌ ప్రాంతం నుంచి గంజాయిని కిలో రూ. 6 వేలకు కొనుగోలు చేసి ప్యాకెట్లుగా చేసి కిలో గంజాయిని రూ. 10 వేల అమ్మకాలు జరుపుతున్నట్లుగా నిందితురాలు తెలిపినట్లు ఎస్సై వెల్లడించారు. ఇంట్లోనే నేరుగా గంజాయిని అమ్మకాలు సాగిస్తున్న మహిళను గంజాయితో పాటు న్యాయమూర్తి ముందు హజరు పరిచి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో ఎస్సై బాలరాజుతోపాటు హెచ్‌సీ యాదగిరి, కానిస్టేబుళ్లు సంతోష్‌ అరుణ్‌లు పాల్గొన్నారు. గంజాయిని పట్టుకున్నందుకు ఈఎస్‌ ప్రదీప్‌రావు సిబ్బందిని అభినందించారు.

Read Also: Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై ఎంక్వైరీ స్పీడప్

Show comments