NTV Telugu Site icon

Live in Partner Murder: స్క్రూడ్రైవర్, సుత్తితో లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసిన మహిళా

Murder

Murder

Live in Partner Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేసి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి లొంగి పోయింది. దాంతో ఆ మహిళ చెప్పిన మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పోలీసులు విచారించగా అది నిజమేనని తేలింది. పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్యతో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: IND vs NZ 2nd Test: నేటి నుంచే రెండో టెస్టు.. రాహులా, సర్ఫరాజా!

ఇకపోతే, మృతుడు సాహిల్ (30) ప్లంబర్‌గా పనిచేసేవాడు. ఏడేళ్ల క్రితం సాహిల్ ఖాన్ ఈ నిందితురాలిని కలిశాడు. ఆ తర్వాత మహిళ తన భర్తను విడిచిపెట్టి 2018 నుండి సాహిల్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. ఇంతలో ఆమె భర్త కూడా చనిపోయాడు. తన నలుగురు పిల్లలను అత్తమామల ఇంట్లో వదిలి వెళ్లాడు. ఆ మహిళ ఏడాది క్రితమే తన పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చింది. అలా చేసినందుకు సాహిల్ తనను వేధించేవాడని, అందుకే తనను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అన్నట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది.

Read Also: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 15 ఫైర్ ఇంజన్లు

ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త దాడికి చోట చేసుకుంది. దింతో తొలుత సాహిల్‌పై స్క్రూడ్రైవర్, సుత్తి, కర్రతో దాడి చేసింది. దాంతో అతడు కిందపడిన వెంటనే ఆ మహిళ స్క్రూడ్రైవర్‌తో కొట్టింది. తొలుత సాహిల్‌పై స్క్రూడ్రైవర్, సుత్తి, కర్రతో దాడి చేసింది. అతడు కిందపడిన వెంటనే ఆ మహిళ స్క్రూడ్రైవర్‌తో కొట్టింది. దాంతో అతను మృతి చెందాడు. ఆ తర్వాత మహిళ మృతదేహంతో దాదాపు ఎనిమిది గంటల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హత్య జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పిల్లలను కూడా సాక్షులుగా మారుస్తామని పోలీసు అధికారి తెలిపారు. పిల్లలను వారి తాతయ్యలకు అప్పగించినట్లు తెలిపారు.