NTV Telugu Site icon

WOLF Teaser: ప్రభుదేవా పాన్ ఇండియ‌న్ మూవీ ‘వూల్ఫ్’ టీజర్ వచ్చేసింది.. సరికొత్తగా అన‌సూయ‌!

Wolf Teaser

Wolf Teaser

Prabhu Dheva, Anasuya and Raai Laxmi’s Wolf Teaser Out: స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా.. ప్రస్తుతం ‘వూల్ఫ్’ చిత్రంలో నటిస్తున్నాడు. నటుడిగా ఈ సినిమా ఆయనకు 60వది. తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. పాన్ ఇండియ‌న్ మూవీగా హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న వూల్ఫ్ సినిమాను సందేశ్ నాగరాజ్, టీ-సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం వూల్ఫ్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు టీజర్‌ను వదిలారు.

ఒక నిమిషం 9 సెకండ్ల నిడివి గల వూల్ఫ్ టీజర్.. అనసూయ భరద్వాజ్ ఎంట్రీతో మొదలైంది. ‘రేపు నేను ఇంటికి వెళ్లాలి.. మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పాను.. ఇక్కడికి రా మాట్లాడుకుందాం అన్నారు’ అనే ఒకే ఒక్క డైలాగ్ టీజర్‌లో ఉంది. ప్రభుదేవా, అనసూయ, రాయ్ లక్ష్మి పాత్రలు చాలా కొత్తగా ఉన్నాయి. టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. హార‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోందని టీజర్‌తో తేలిపోతుంది.

Also Read: Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ విడాకులు కన్ఫార్మ్.. ఒక్క పోస్ట్‌తో..!

వూల్ఫ్ సినిమాలో రాయ్ లక్ష్మి, అనసూయ భరద్వాజ్, అంజు కురియన్, వశిష్ట ఎన్ సింహా, శ్రీ గోపిక, రమేస్ తిలక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డైరెక్ష‌న్‌, కొరియోగ్ర‌ఫీపై ఎక్కువగా ఫోక‌స్ చేయని ప్రభుదేవా.. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. వూల్ఫ్‌తో పాటు త‌మిళంలో ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే సినిమాను ప్రభుదేవా చేస్తున్నారు. ఇందులోనూ అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Also Read: Samsung 110 Inch TV: శాంసంగ్‌ నుంచి 110 ఇంచెస్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

 

 

 

Show comments