Chiranjeevi : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88 ) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు..గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రామోజీరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.రామోజీరావు ఇక లేరు అనే వార్త తెలుసుకున్న సినీ ,రాజకీయ ప్రముఖులు,అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
Read Also :Sreeleela : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీలీల..?
మెగాస్టార్ చిరంజీవి రామోజీరావు నివాసం వద్దకు చేరుకొని రామోజీరావు భౌతికకాయం వద్ద పుష్ప గుచ్చం అందించి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు.ఆయన మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయింది అని అన్నారు.తాను ప్రజారాజ్యం స్థాపించే సమయంలో ఆయన సలహాలు ,సూచనలు కోసం కలిసేవాడిని అని చిరంజీవి తెలిపారు.ఆయన ఎంతో మందికి స్ఫూర్తిని అందించారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.