మెంతికూర మానవుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చటి ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రధానమైనవి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెంతులు రుచికి కొంచెం చేదుగానే ఉన్నా కానీ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా మెండుగా ఉంటాయి. మెంతి ఆకులను ఎక్కువగా పరోటాలో వాడుతుంటారు. వేడి వేడి మెంతికూర పరోటా చాలా మందికి ఇష్టం.. మెంతికూర ఉపయోగించడం వలన అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. అయితే.. మెంతి ఆకులను అతిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతి ఆకుల వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: World Cup 2023 Final: ఫైనల్ పోరులో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువున్నాయంటే..!
మధుమేహంలో నష్టం
మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట మెంతి గింజలను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో దాని నీటిని త్రాగాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెంతులు ఎక్కువగా తీసుకుంటే, చక్కెర స్థాయి వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. మెంతిలోని పోషకాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.. కావున పరిమితి స్థాయిలో మాత్రమే తినాలని అంటున్నారు.
అధిక రక్తపోటు ఉన్న రోగులు
మెంతులు తినడం రక్తపోటు రోగులకు ప్రమాదకరం. ఎందుకంటే మెంతులు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి తగ్గుతుంది. దాంతో రక్తపోటును తగ్గిస్తుంది. అందుకోసమని అధిక రక్తపోటు ఉన్న రోగులు మెంతులు ఎక్కువగా తీసుకోకపోవడం మంచింది.
గర్భధారణ సమయంలో తినొద్దు
చాలా మంది మెంతులు శరీరంలో వేడి కోసం తింటారు. గర్భధారణ సమయంలో వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మెంతులు ఎక్కువగా తీసుకుంటే రక్తం గడ్డకడుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో కూడా మెంతులతో చేసిన ఆహారపదార్థాలను తక్కువగా తినాలి.
జీర్ణక్రియలో సమస్య
జీర్ణ సమస్యలు ఉన్నవారు మెంతికూరను తినకూడదు. ఎందుకంటే దీని వల్ల ఎక్కువ గ్యాస్ ఏర్పడుతుంది. అంతేకాకుండా.. తినే కూరల్లో ఎక్కువగా పచ్చి మిరపకాయలను వాడొద్దు. తరచుగా ఎసిడిటీతో బాధపడేవారు పచ్చి మిరపకాయలకు దూరంగా ఉండాలి.
