Site icon NTV Telugu

Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల

Parliament

Parliament

Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ చార్జి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగుతాయి. 23 రోజులపాటు 17 సమావేశాలు జరగనున్నాయి. సెషన్‌లో శాసనసభ వ్యవహారాలు , ఇతర అంశాలపై చర్చల కోసం, నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నాను” అని మంత్రి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లులు, అంశాల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ఎగువ సభలో కార్యకలాపాలను నిర్వహించే మొదటి సమావేశం ఇది కావడం గమనార్హం.

Read Also: Narendra Modi: వాటికి ముడిపెట్టొద్దు.. మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన

కాగా, పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ నెల 21న ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి నిర్మలాసీతారామన్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమల చాంబర్లు, మౌళిక సదుపాయాలు, పర్యావరణ రంగ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. శీతాకాలపు సమావేశాలు సాధారణంగా ప్రతేడాది నవంబర్ మూడో వారం ప్రారంభిస్తారు. కానీ ఈసారి డిసెంబర్లో ప్రారంభమవుతుంది. రూ.1,200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త భవనాన్ని డిసెంబర్లో లాంఛనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అంటే 2023 మొదటి పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించబడతాయని తెలుస్తోంది.

Exit mobile version