NTV Telugu Site icon

Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

Wine Shop Closed

Wine Shop Closed

మండు వేసవిని చల్లటి బీరుతో ఎంజాయ్ చేయాలనుకునే మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు రెండు రోజుల డ్రైడేస్ ను ప్రకటించారు. ఫలితంగా మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.

Also Read: Current Bill: కేవలం 14 యూనిట్లకు కరెంట్ వాడకానికి వేలల్లో బిల్లు.. వైరల్..

మే 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.మద్యం దుకాణాలతో పాటు కల్లు ప్రాంగణాలను కూడా మూసివేయనున్నారు. అంతేకాకుండా, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు జూన్ 4వ తేదీన మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. పండుగలు, సెలవులు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేస్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివాదాలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.