NTV Telugu Site icon

Chandrababu: కిరణ్ కుమార్ రెడ్డి, జయచంద్రా రెడ్డిని గెలిపించండి

Cbn

Cbn

రాజంపేట ఎంపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అభ్యర్థి జయచంద్రా రెడ్డిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మొరుసు కాపులు ఎక్కువగా ఉన్నందునే జయచంద్రా రెడ్డి కి టికెట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంపీ గా కిరణ్ ని టచ్ చేయగలడా ఈ పెద్దిరెడ్డి ఫామిలీ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా అని విమర్శించారు. 7 నెలల గర్భిణి తాగడానికి నీరు అడిగితే ఈ ఎమ్మెల్యే భార్య సాక్షిగా గర్భిణి పై దాడి చేసి కొట్టారని ఆరోపించారు. 13 న ఓటింగ్ గెలిచేది మనమే అని ధీమా వ్యక్తం చేశారు.

READ MORE: Prajwal rape victims: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఆర్థిక సాయం

600 మంది తమ్ముళ్లపై అక్రమ కేసులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సెంటర్ లో నాపై అక్రమ కేసులు పెట్టారన్నారు. గతంలో నువ్వు ఇదే అంగళ్లు మీద పాదయాత్ర చేశావ్.. అప్పుడు నేను కన్నెర్ర చెసి ఉంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా అన్నారు. తంబల్లపల్లి ఎవ్వరి జాగిరి కాదన్నారు. ఇప్పుడు కూడా చెపుతున్న అంగళ్లు కు వస్తూనే ఉంట అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకొంటు వెళ్తా అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసినా నా మీదే అక్రమ కేసు బనాయించారని తెలిపారు. ఆంబోతుల చేతులలో తంబల్లపల్లి సర్వ నాశనం అయ్యిందని ఆరోపించారు. సవాల్ విసరడానికే వచ్చ నిన్ను పుంగనూరుకు తరమడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి చిత్తూర్ అసెంబ్లీ సీట్ ఇచ్చారని ఆరోపించారు. అరచకాలన్ని లెక్కపెడ్తున్న తొందరలోనే అన్నీ వడ్డీ తో కలిపి ఇస్తా అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు, మానిఫెస్టో తో జగన్ 2 రోజుల నుండి సభలు కూడా రద్దు చేసుకొన్నాడని పేర్కొన్నారు.