Site icon NTV Telugu

Wimbledon 2025 Final: అల్కరాజ్, సినర్‌ సూపర్.. నెల రోజుల్లోనే ఇద్దరికీ రెండవ ఫైనల్!

Carlos Alcaraz Vs Jannik Sinner

Carlos Alcaraz Vs Jannik Sinner

ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్.. చివరి దశకు చేరుకుంది. ఇటు మెన్స్ అటు ఉమెన్స్ ఇద్దరు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లలో తలపడతారు. మెన్స్ విభాగంలో మరోసారి అల్కరాజ్, సినర్‌ ఫైనల్లో తలపడనున్నారు. సినర్‌ సెమీఫైనల్లో టాప్ సీడ్ అయిన జకోవిచ్ ను సునాయాసంగా ఓడించాడు. మొదటి 3 సెట్లలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టాడు. దీంతో సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ సెమిస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.

మరో సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్, టేలర్ ఫ్రిట్జ్ పై గెలిచాడు. ఈ గెలుపు కోసం అల్కరాజ్ కాస్త కష్టపడాల్సి వచ్చింది. మొదటి సెట్ ను 6-4తో గెలుచుకున్న అల్కరాజ్.. రెండవ సెట్ ను కోల్పోయాడు. అయితే 3వ సెట్లో మళ్ళీ తన ఆధిపత్యం చెలాయించి గెలిచాడు. ఇక నాల్గవ సెట్ కూడా టై బేకర్ లో గట్టి పోటీ ఎదుర్కొని, చివరకు బ్రేక్ పాయింట్ సాధించి ఫైనల్ కు చేరుకున్నాడు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ.. టాప్ టీమ్స్‌తో కలిసి పోటీ!

గత నెలలో ప్యారిస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్, సినర్‌ తలపడ్డారు. సుమారు 5 గంటల 20 నిమిషాల పాటు జరిగిన ఆ మ్యాచులో చివరి పాయింట్ వరకు నువ్వా నేనా అన్నట్లు ఆడారు. కానీ చివరకు అల్కరాజ్ మ్యాచ్ గెలిచి, ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరే ఫైనల్ కు చేరుకోవడంతో.. ఈసారి ఎవరు ఈ గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంటారో అని చర్చించుకుంటున్నారు. ఇక వీరితో పాటు ఉమెన్స్ విభాగంలో అనిసిమోవా, స్వీయటెక్ ఫైనల్లో తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా వారికి ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్‌ అవుతుంది.

Exit mobile version