NTV Telugu Site icon

Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?

Whatsapp Image 2024 02 16 At 9.42.39 Am

Whatsapp Image 2024 02 16 At 9.42.39 Am

‘ఆర్‌ఆర్‌ఆర్‌’సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఇమేజ్‌ గ్లోబల్ స్థాయికి చేరింది.ఇప్పుడు ఆయన పాన్‌ వరల్డ్‌ స్టార్‌. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజ్‌లో ‘దేవర’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు..దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ తీర్చిదిద్దిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఇందులోని అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ కోసం జోడించిన వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకులకి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయని వారు అంటున్నారు.

ఇదిలావుంటే ఈ సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని నిర్మాతలు భావించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఇందులో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ అనుకోకుండా గాయపడటంతో షూటింగ్‌ లో కాస్త జాప్యం జరిగింది. దాంతో విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది.సైఫ్‌ విశ్రాంతిలో ఉండటంతో ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను దర్శకుడు కొరటాల చిత్రీకరిస్తున్నార. సైఫ్‌ షూటింగ్ లో జాయిన్ తరువాత మిగతా టాకీ కూడా పూర్తి చేయనున్నారు..దీనితో దేవర సినిమా విడుదలపై క్లారిటీ కూడా అప్పుడే వస్తుందని సమాచారం..ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మాంటేజస్‌ సాంగ్‌ చిత్రీకరణ పూర్తి చేసారు. ఇంకా నాలుగు పాటల చిత్రీకరణ మిగిలివుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు అయిన జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ వీడియో లో అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది