NTV Telugu Site icon

Pushpa 2 : క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?

Alluarjun .

Alluarjun .

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “పుష్ప 2”.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసారు .పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతుంది.

Read Also :Vishwak Sen: బాలయ్య కాల్ చేస్తే ఏడుపొచ్చేసింది.. కొన్నేళ్ల తరువాత ఏడ్చేశా!

ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ కానుంది.స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు .ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా క్లైమాక్స్ లో మేకర్స్ ఊహించని ట్విస్ట్  ఇవ్వనున్నట్లు సమాచారం .పుష్ప 3 కి సంబంధించి ఇన్ఫో ఇవ్వనున్నట్లు తెలుస్తుంది .అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ ఈ సాంగ్ షూట్ కూడా చేయనున్నారు.

Show comments