NTV Telugu Site icon

NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఏకంగా అన్ని దేశాలలో జరగనుందా..?

Ntr31

Ntr31

NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర” ఈ సినిమాను మాస్ దర్శకుడు
కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది,బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Read Also :Kalki 2898 AD : ఉత్తర పాత్రలో మాళవిక నాయర్.. అస్సలు ఊహించలేదుగా..

ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మేకర్స్ ఇటీవల అప్డేట్ ఇచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు.ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ మొదలు పెట్టనున్నారు.ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు “డ్రాగన్ ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.డ్రాగన్ అంటే యూరోపియన్ సంస్కృతిలో చెడుకి గుర్తు అని అర్ధం.అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక రాక్షసుడిలా కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఏకంగా 15 దేశాల్లో జరుపనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది .