NTV Telugu Site icon

NTR vs Hrithik: ‘నాటు నాటు’కి మించి.. స్క్రీన్స్ పరిస్థితి ఏంటో?

Ntr Vs Hrithik

Ntr Vs Hrithik

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దర్శకుడు అయాన్ ముఖర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ క్రేజీ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్. అందుకోసం ఏకంగా వంద కోట్ల పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారంలో ఉంది.

సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ రేంజ్‌లో ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ ఊహకందని రీతిలో ఉంటాయని అంటున్నారు. అలాగే ఈ ఇద్దరిపై ఉండే సాంగ్.. నాటు నాటుకి మించి ఉంటుందని, వీళ్ల స్టెప్పులకు స్క్రీన్స్ తగలబడిపోతాయని చెబుతున్నారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు దేవర హిట్ జోష్‌లో ఉన్న టైగర్.. నెక్స్ట్ వార్ 2 షెడ్యూల్‌కి రెడీ అవుతున్నారు. ఈ నెలలోనే షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు.

Also Read: Mega Hero Movies: అయ్యో రామ.. ఒకరినొకరు టార్గెట్ చేసుకున్న ‘మెగా’ హీరోస్!

వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని తెలియగా.. ఇప్పుడు క్లైమాక్స్‌ షూటింగ్‌ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్‌ని నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక్కడితో వార్ 2 మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ కానున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్, హృతిక్ వార్‌ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. వచ్చే ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు సిద్దమవుతోంది.

Show comments