MLA Seetakka: ములుగు నుండే పోటీ చేస్తా.. రాబోయేది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యమే అని మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. భద్రాద్రి, మణుగూరులో ముత్యాలమ్మ మైసమ్మ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా రాజకీయ ఉద్యోగాలు ఇస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించ పడాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని ముత్యాలమ్మ మైసమ్మని కోరుకున్నా అని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను ప్రభుత్వం ఉపేక్షించేది లేదన్నారు. తొగ్గుగూడెంలోని సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టేకుచెట్లబజార్‌లో జరిగిన ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలుత ఎమ్మెల్యే సీతక్కను ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.
Read also: AP CM Jagan Tour: రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
అనంతరం సీతక్క మాట్లాడుతూ.. ములుగు నుండే పోటీ చేస్తా అని అన్నారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని ముత్యాలమ్మ మైసమ్మని కోరుకున్నానని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యమే అని తెలిపారు. సంక్షేమ రాజ్యంలో మహిళలు సంతోషంగా ఉండాలంటే ధరలు తగ్గించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కి ఉందన్నారు. గతంలో 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. రాను రాను పరిశ్రమలు మూతపడి నిరుద్యోగ సమస్య ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Astrology: సెప్టెంబర్ 14, గురువారం దినఫలాలు
